calender_icon.png 17 March, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపద్బాంధవుడు పోచారం

08-03-2025 10:58:09 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ బీర్కూరు మండలంలో గత వారం రోజుల క్రితం విద్యుత్ ఘాతంతో దళితవాడలో మూడు పెంకుటిల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయి రోడ్డును పడ్డ బాధితులను శనివారం ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో మాజీ మంత్రి మాజీ శాసనసభ పతి ప్రస్తుత ఎంఎల్ఏ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ రోజు అగ్ని బాధిత కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. ఒక్క ఒక్కరికి 10000 ఆర్థిక సహాయం చేసినారు   ముగ్గురి కుటుంబలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇస్తాను అని భరోసా కల్పించారు. విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటారని వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఎస్ సి  మాల కుల పెద్దలు మరియు బీర్కూర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శామల. మియపురం శశికాంత్ . మాజీ ఎంపీటీసీ సందీప్ .విజయ్ ప్రకాశ్ .యమా రాములు . అవారి గంగారాం . సంబు రాజు పటేల్.అరిఫ్ . లయాక్ . మన్నాన్ .లాడగం గంగారాం. సానేపు గంగారాం.  కొరిమే రఘు .బాస్వంత్ .యూవకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు