11-03-2025 12:15:09 AM
హుజూర్ నగర్, మార్చి 10 : సాటి ఉద్యోగికి ఆర్థిక సహాయం చేసిన అంగన్వాడీలు.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అంగన్వాడి కేంద్రం 5 లో ఆయాగా పనిచేస్తున్న గుంటి ఉమా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది.హుజూర్నగర్ సెక్టార్ పరిధిలో ఉన్న టీచర్లు ఆయాలు 22 మంది ఒకరోజు వేతనాన్ని , 5 వ కేంద్రం టీచర్ ఆకుల రజని తమ 15 రోజుల వేతనాన్ని కలిపి మొత్తం 22 వేల రూపాయలను అంగన్వాడి టీచర్లు శాంతా రాజ్యం, సుధారాణి, సునీత కుమారి, రజిని, షహజాది బేగం హైదరాబాద్ వెళ్లి ఆయా ను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేసినారు