01-03-2025 05:26:01 PM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
అగ్ని ప్రమాద ఘటనలో లక్ష రూపాయలు ఆర్థిక సాయం
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): అగ్ని ప్రమాద(Fire Accident) ఘటనలో మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్(MLA Prakash Goud) భరోసా ఇచ్చారు. మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని పుప్పాలగూడ పాషా కాలనీ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగి చిన్నారి సహా మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం ఇచ్చారు.
విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. తక్షణ సహాయం నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అగ్ని ప్రమాదకటనలు ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ ముదిరాజ్, ఎక్స్ కౌన్సిలర్ వెంకటేష్ యాదవ్,అశోక్ యాదవ్ తదితరులు ఉన్నారు.