22-03-2025 05:14:43 PM
వైరా,(విజయక్రాంతి): వైరా లయన్స్ క్లబ్(Wyra Lions Club) ఆధ్వర్యంలో శ్రీ దత్త సాయి మందిరంలో శనివారం ఎవరెస్టు శిఖరం(Mount Everest) అధిరోహించాలని పట్టుదలతో ఉన్న ధర్మ సోతు మోతి కుమార్ కు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డా.మురళీకృష్ణ(Past District Governor Dr. Murali Krishna) రూ.పదివేల ఆర్థిక సహాయం, ట్రావెల్ బ్యాగును వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాపా మురళి కృష్ణ మాట్లాడుతూ... మోతి కుమార్ యువకుడిలో ఉన్న పట్టుదలతో పర్వతారోహణ చేసి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని, కొండంత పట్టుదలతో ఉన్న యువకుడు సాధించాలని అన్నారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన కుమార్ ఆర్థిక స్తోమత లేకపోయినా ఒకటి సాధించాలని, తపన దీక్ష పట్టుదలతో పర్వతారోహణ మార్గాన్ని ఎంచు కోవడం అభినందనీయమన్నారు. దాతలు స్నేహితుల సహకారంతో అనుకున్నది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిఎస్టి కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ లగడపాటి ప్రభాకర్ రావు, జోన్ చైర్మన్ పెనుగొండ ఉపేందర్ రావ్, క్లబ్ కోశాధికారి మరికంటి రాంగోపాల్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, మాదినేని సునీత, వై బుచ్చి రామారావు, నూకల ప్రసాదరావు, చింతోజు నాగేశ్వరరావు, సభ్యులు కట్ల సురేష్, చెరుకూరు శ్రీనివాసరావు, కొల్లా రాంబాబు, గద్దె నీరజ తదితరులు పాల్గొన్నారు.