16-03-2025 06:55:10 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ భాగాల సంతోష్ ని ఆదివారం అతని స్వగ్రామమైన ఎల్లారంలో మంచిర్యాల జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పరామర్శించి రూ 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాయపడ్డ కానిస్టేబుల్ భాగాల సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని అసోసియేషన్ సభ్యులు భరోసా ఇచ్చారు.