15-02-2025 07:35:24 PM
వికారాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజక వర్గం దౌల్తాబాద్ మండలం గోకా ఫసల్వాద్ గ్రామంలో 2017 సంవత్సరంలో పిడుగు పడి తల్లిదండ్రులు (వెంకటప్ప, గోవిందమ్మ) ఇద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపోసిట్ ఖాతా పుస్తకాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చిన్నారులకు అందజేశారు.
శనివారం కలెక్టర్ ఛాంబర్ నందు గోకా ఫసల్వాద్ గ్రామంలో తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులు పవన్ (09), అర్చన(04) చిన్నారులకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపోసిట్ ఖాతాలో ప్రతి నెల వచ్చే ఇంట్రస్ట్ అమౌంట్ నెల వారి ఖర్చుల కోసం వారి వారి ఖాతాలో జమ అయ్యే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అదేవిదంగా సెంట్రల్ డిపార్టుమెంటు స్పానసర్ స్చీం ద్వార ప్రతీ నెల వచ్చే రూ.4000/- కూడా వారి ఖాతా నందు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ పిల్లలతో బాగా చదువుకొవాలని, నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, డి సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు(D Section Superintendent Venkateshwarlu), పిల్లల నాన్నమ్మ బాలమ్మ ఉన్నారు.