calender_icon.png 27 December, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్షుమన్‌కు ఆర్థిక సాయం

15-07-2024 12:05:00 AM

క్యానర్ చికిత్స కోసం బీసీసీఐ కోటి రూపాయలు

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్‌కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. 71 ఏళ్ల అన్షుమన్ బ్లడ్ క్యానర్‌తో పోరాడుతుండగా.. అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం అదించాలని మాజీ క్రికెటర్ల నుంచి బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘క్యాన్సర్‌తో పోరాడుతున్న వెట రన్ క్రికెటర్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే కోటి రూపాయలు విడుదల చేయాలని బోర్డు కార్య దర్శి జై షా ఆదేశించారు. గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండగా ఉంటుంది’ అని అపెక్స్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.