కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన బాలికకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం కొమురం భీం జిల్లా జైనూరు మండలంలోని సాయి శ్రద్ధ అనే గిరిజన విద్యార్థిని ఎంబిబిఎస్ లో సీటు సాధించినందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున హాస్టల్ ఫీజులు తదితర ఫీజులు కట్టలేని పరిస్థితిలో పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందించారు. పేదరికంతోనే ఎంబీబీఎస్ సాధించిన సాయి శ్రద్ద ఫీజు కూడా చెల్లించలేని ఆర్ధిక దుస్థితిలో కుటుంబం నెటిజన్ ద్వారా తెలుసుకున్న గిరిజన బాలిక సాయిశ్రద్ధకు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకొని నీట్‌లో సీటు సంపాదించి ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ డాక్టర్ అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. డాక్టర్ కావాలనుకుంటున్న ఆ బాలికకు భరోసా ఇస్తున్న అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు. తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. వైద్య విద్యకు అవసరమైన ఫీజుతో పాటు ఇతర ఖర్చుల కోసం చెక్ ను అందజేశారు రేవంత్. ఈ సందర్భంగా సీఎంకు సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.