calender_icon.png 27 April, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

26-04-2025 05:47:54 PM

అశ్వాపురం (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామానికి చెందిన బండి అనిల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. పేదకుటుంబానికి చెందిన తమ స్నేహితుడు అనిల్ మృతి పట్ల కలత చెందిన 2004-05 టెన్త్ క్లాస్ మేట్స్ అందరూ కలసి రూ.35 వేలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించారు. భవిష్యత్ లో తమ స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని ఆ కుటుంబాన్ని ఓదార్చి,హామీ ఇచ్చి దైర్యం చెప్పారు. 

నగదును అనీల్ భార్య పిల్లలకు అందించి తమ గొప్పమనసును చాటుకున్నారు. 22 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న తమ మిత్రున్ని గుర్తుంచుకొని, ఆయన మరణంతో కష్టాల్లోకి నెట్టివేయబడిన మిత్రుని కుటుంబం కన్నీరు తుడవాలనే గొప్పసంకల్పంతో ముందుకు వచ్చిన వీరు మరెందరికో ఆదర్శం కావాలి అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో తులసి, సృజన, పాయం ఎర్రయ్య, జెట్టి సాంబ, రాజేష్, అనీల్, తదితరులు పాల్గొన్నారు.