calender_icon.png 26 April, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

25-04-2025 06:50:22 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు రూ.40,000 లను మృతుని పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి, ధ్రువపత్రాలను మృతుని కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు శుక్రవారం పాల్గొన్నారు.