21-02-2025 12:09:56 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) ః నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఐటిడిఏ పిఓ రాహుల్ అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండల ధనలక్ష్మి ఫ్లు యాస్ బ్రిక్స్ యూనిట్ సభ్యులకు సబ్సిడీనీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ గిరిజన యువతి,యువకులు ఐకమత్యంతో కలిసికట్టుగా ఉండి,స్వశక్తితో కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని, మార్కేటింగ్ సౌకర్యం కల్పించుకోవాలన్నారు.
తద్వారా జీవనోపాది పొందుతూ,పదిమందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఆళ్లపల్లి మండలం శ్రీ ధనలక్ష్మి ఫ్లు యాష్ బ్రిక్స్ యూనిట్ సభ్యుల తో ఇటుకలు తయారు చేసే విధానాన్ని ఇటుకల కొరకు వాడే యాష్ గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వస్శక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకోవడా నికి గిరిజన యువకులు నలుగురికి రూ15 లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న శ్రీ ధనలక్ష్మి ఫయాశ్ బ్రిక్స్ యూనిట్ను గిరిజన యువతి, యువకులను ఆయన అభినందించారు.
ఇటుకల తయారీ కోసం, సిమెంటు సొంతంగా తామే కొనుగోలు చేసుకుని నాణ్యత గల ఇటుకలు తయారుచేసి సరసమైన ధరలకు అమ్ముకోవాలని అన్నారు. శ్రీ ధనలక్ష్మి ఫ్లు యాష్ బ్రిక్స్ యూనిట్ యూనిట్ నెలకొల్పుటకు రూ 25 లక్షలు యూనిట్ కాస్ట్ కాగా రూ 15 లక్షలు సబ్సిడీ లభించిందని, రూ 2.50 లక్షలు బెనిఫిషర్ కంట్రిబ్యూషన్ తో యూ నిట్ను ఏర్పాటు చేసుకున్నామని, రూ 7.50 లక్షలు బ్యాంకు రుణము లభించిందని, దీంతో శ్రీ ధనలక్ష్మి ఫయాశ్ బ్రిక్స్ యూనిట్ ను అభివృద్ధి చేసుకుంటామని గిరిజన యువతి,యువకులు పిఓకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, ధనలక్ష్మి బ్రిక్స్ యూనిట్ సభ్యురాలు సుశీల, శ్రీకాంత్ పాల్గొన్నారు.