22-04-2025 01:57:06 AM
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21: మృతి చెందిన బాధిత కుటుంబానికి కురుమ సంఘం సభ్యులు ఆర్థిక సహాయం అందజేసారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బ జారు బిక్షపతి ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. కాగా తన కూతురు ఇటీవల ప్రమా దవశాత్తు గోడ కూలి మరణించింది.
ఇదే ఘటనలో ఆయన కుమారుడి కాలు విరిగి చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామానికి చెందిన కురుమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి పరామర్శించి రూ. 1,54,000 ల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని, అధైర్య పడవద్దని, తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నామణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కురుమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు