calender_icon.png 25 September, 2024 | 2:10 PM

నేటి నుంచి బాధితుల ఖాతాల్లోకి రూ.10వేల ఆర్థికసాయం

06-09-2024 12:39:23 AM

  1. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి
  2. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటన 
  3. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా

ఖమ్మం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.౧౦వేల ఆర్థిక సాయం జమచేస్తామని చెప్పారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, జలగంనగర్, పెద్దతండ వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. పారిశుద్‌ద్ధ్య చర్యలు వేగవంతం చేయాయాలని అధికారులను ఆదేశించారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో  ఇండ్లల్లోని బురదను తొలగించాలని సూచించారు. తక్షణ సహాయం, బాధి తుల వివరాల సేకరణపై అధికారులకు తగు సూచనలు చేశారు. 

నష్టపోయిన ప్రతి ఇంటికి  సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు సర్వే ప్రక్రియను వెంటనే చేపట్టి, నష్ట అంచనా పూర్తి చేయాలని కోరారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని ధైర్యం నింపారు. బైక్‌పై కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సాయం అందిస్తామని  భరోసా కల్పించారు. ఆయనతోపాటు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.