11-03-2025 12:05:20 AM
సమగ్ర శిక్షా ఉద్యోగుల ఉదారత
చేగుంట, మార్చి 10: చేగుంట మండలం మక్కారాజపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సిఆర్ప లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆ కుటుంబాలకు సీఆర్పీ ఉద్యోగులు తమవంతు సాయంగా రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
మండలంలోని చందాయిపేట గ్రామానికి చెందిన ఎర్ర శ్రీనివాస్, జైత్రం తాండకు చెందిన మాలోత్ శ్రీనివాస్ నాయక్ లకు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు వివిధ మండలాల్లో రూ.12 లక్షల ఆర్థిక సాయం సేకరించారు.
ఈ చెక్కులను సోమవారం జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ చేతుల మీదగా ఆ కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ జ్యోతి, సుదర్శన మూర్తి, మండల విద్యాధికారి నీరజ, రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి, శేషాద్రి, సంపత్, రాజు, చల్ల లక్ష్మణ్‌పాల్గొన్నారు.