calender_icon.png 24 February, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనహిత ఫౌండేషన్ రూ.6 వేలు ఆర్థిక సహాయం

24-02-2025 07:11:25 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ మండల పరిధిలోని పునుకుల సూర్య తండాకు చెందిన మాలోత్ మంగ్లీకి జనహిత ఫౌండేషన్ సోమవారం రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మంగ్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కూలీపనికి వెళ్తూ జీవనం సాగించేది, గత మూడు నెలల నుండి అనారోగ్యం కారణంగా కూలీపనికి వెళ్లడం లేదు. హాస్పిటల్ ఖర్చుల నిమిత్తము మంగ్లీకి జనహితా ఫౌండేషన్ రూ.6 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనహితా ఫౌండేషన్ సభ్యులు శ్రీలక్ష్మి, రేణుక, సుధాకర్, నరేష్ పాల్గొన్నారు.