03-03-2025 01:17:39 AM
సాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్
కడ్తాల్, మార్చి 2 (విజయక్రాంతి): కడ్తాల్ మండలంలోని పేదింటి ఆడబిడ్డలకు జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తానున్నాననే భరోసానిస్తుంది. పేదింటి వివాహాలకు సొంతం మేనమామలు తోడుంటారో లేదో తెలియదు కానీ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత జర్పుల దశరథ్ నాయక్ మాత్రం మేనమా మ లోటును భర్తీ చేస్తున్నారు. మండలంలో పెదింటి ఆడబిడ్డల వివాహం అయితే 21వేల రూపాయల నగదు తో పాటు ఒక పట్టు చీరను మేనమామ కట్నం కింద కానుకగా ఇస్తున్నారు.
ఆదివారం కడ్తాల్ గ్రామానికి చెందిన డేరంగుల ఎల్లమ్మ పాండు దంపతుల కూతురు మహేశ్వరి వివాహానికి హాజరై 21వేల నగదు తో పాటు పట్టుచీరను అందించగా కడ్తాల్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ శారద పాండు, మాజీ మార్కెట్ డైరెక్టర్ లాయక్ ఆలీ, మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్, నాయకులు యాదయ్య, వెంకటేష్, పాండు, రాజు, జగన్, జంగయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.