calender_icon.png 25 March, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందిరం నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం

23-03-2025 08:03:24 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఆదివారం రూ.11000 విరాళం అందజేశారు. బీజేపీ నాయకులు, కోనేరు శశాంక్ హనుమాన్ మందిరం నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందించారు. నస్రుల్లాబాద్ మండల బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు రూ.2,500 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.