calender_icon.png 4 March, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయపడిన చిన్నారి కృతిక చికిత్సకు ఆర్ధిక సాయం..

02-03-2025 07:05:37 PM

అభినందించిన సిపిఐ కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): పట్టణంలోని రామవరం ఏరియా హనుమాన్ జిమ్, బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నాలుగేళ్ళ చిన్నారి పాసి కృతిక చికిత్స నిమిత్తం రూ.20వేల నగదును, ఆదివారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా చేతులమీదుగా చిన్నారి తండ్రి, ఆటో డ్రైవర్ కళ్యాణ్ పసికి అందింపచేశారు. ఈ సందర్బంగా ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ... ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. పూర్తిస్థాయి చికిత్సకోసం దాతలు ముందుకు రావాలని, ప్రభుత్వం స్పందించి చిన్నారి చికిత్సకోసం, మెరుగైన వైద్యంకోసం సహకరించాలని కోరారు. చిన్నారి పాసి కృతిక త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హనుమాన్ జిమ్ బ్లడ్ ఫౌండేషన్ సభ్యులు దాసు, సుధాకర్, లడ్డు, రాజేష్, సురేష్, దిలీప్ సంపత్, కమలాకర్, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.