16-04-2025 04:29:32 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని సామల వీరభద్రం అనే నిరుపేద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలకు కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బోగోజు నాగేశ్వరాచారి మాట్లాడుతూ.. క్లబ్ చైర్మన్ మామిడి అశోక్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి అండగా నిలిచేందుకు సభ్యులు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్నం శ్రీరాములు, చింతా కరుణాకర్, పరాంకుశం శ్రీహరి, రాపాక కుమారస్వామి, రుద్ర శ్రీకాంత్, చెలమల్ల కిరణ్, కంచు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.