వికలాంగునికి ఆర్ధిక సహాయం అందచేసిన లయన్స్ క్లబ్… అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజపేట్ కు చెందిన కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యముతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆప్ హోప్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఈరొజు తన ఆఫీసుకి పిలిపించి చికిత్స కోసం తన సంస్థ ద్వారా రూ.10 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సాయం చేయడం తనకు ఎంతో ఆనందం ఇస్తుందని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై నా వంతు సాయం ఎల్లవేళలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగరెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, బర్కా మల్లేష్ యాదవ్, మారం ప్రసాద్, సింగదాసరి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.