18-02-2025 04:24:54 PM
నడిగూడెం (విజయక్రాంతి): మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. 1997-98లో ఆయనతో పాటు 10వ తరగతి ZPHS సిరిపురం పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం హుస్సేన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. అందజేసిన మొత్తాన్ని 40 వేల రూపాయలు వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్సెడ్ డిపాజిట్ చేయించి పత్రాల్ని వారికి అందజేశారు.