ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు ఓ వైద్య విద్యార్థినికి ఆర్థిక సహా యం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన జీ సంజన ప్రియ ప్రస్తుతం కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెకం డియర్ చదవుతున్నది. తన తండ్రి అనారోగ్యం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది.
దీంతో ఆమె తన సెకండ్ ఇయర్‌కు సంబంధించిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ (ప్రేమ్), కోశాధికారి బీ గుణవంత్‌రావ్ పాల్గొన్నారు.