* వివిధ ఆర్థిక పథకాలపై సమీక్ష
న్యూఢిల్లీ, జనవరి 12: జన్ సురక్ష, ముద్రా యోజన తదితర ఆర్థిక పథకాల ప్రగతిని సమీక్షించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో జనవరి 15న సమావేశం కానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ సర్వీసుల కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రతినిధులు హాజరవుతాయని ఆ వర్గాలు పేర్కొ న్నాయి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్‌లు పరిపూర్ణ స్థితికి చేరడంతో ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు కొన్ని పథకాల కాలపరిమితిని పొడిగిస్తున్నది.