23-03-2025 01:21:56 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): గ్రామ పరిపాలనను బలోపేతం చేయడానికి రెవెన్యూ శాఖలో 10,954 మంది గ్రామస్థాయి అధి కారుల (జీపీవో) భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివా రం ఉత్తర్వులు జారీచేశారు.
ఇటీవల జీపీవో పోస్టుల నియామకానికి క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ పోస్టులను గతంలో రెవెన్యూ శాఖలో వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పనిచేసినవారితో భర్తీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.