calender_icon.png 24 October, 2024 | 6:01 AM

మంథని, ముత్తారంలో ఏదేచ్ఛంగా వడ్డీ వ్యాపారం

17-09-2024 03:48:44 PM

పెద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని అడ్డగోలుగా వడ్డీ  దొపిడీ

మంథని ముత్తారంలో సొమ్ము చేసుకుంటున్నా ఫైనాన్స్ దందా...

పట్టించుకోని పోలీసులు అధికారులు...

పెద్దపల్లి,(విజయక్రాంతి): మంథని, ముత్తారం మండలాలలో ఏదేచ్ఛంగా వడ్డీ వ్యాపారం కొనసాగుతుంది. ఆపద వచ్చి డబ్బు కావాలనీ ఫైనాన్స్ దళారులను ఆశ్రయిస్తే 15% నుంచి 20% శాతం వడ్డీ వసూలు చేస్తున్న ఫైనాన్స్ దళారులు, అడ్డగోలుగా పేదల వద్ద దొపిడి చేస్తున్న పోలీసులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పేద ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంథని, ముత్తారం మండల కేంద్రంలోని ముత్తారం, అడవి శ్రీరాంపూర్, పారుపల్లి. కేసనపల్లి గ్రామాలలో కొంతమంది డబ్బు ఉన్న దళారులు ఫైనాన్స్ అక్రమ దందా నడుపుతూ ప్రజల అవసరాలను ఆసరా చేసుకుంటూ వారి ఆపదకి అక్రమ ఫైనాన్స్ లు ఇస్తూ  దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఈ అక్రమ ఫైనాన్స్ వడ్డీ శాతం 15%, 20 శాతం వసూలు చేస్తున్నారు.  మండల కేంద్రాలలో విపరీతంగా ఈ దందా  హోటళ్లు. చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటన్నారు. ప్రభుత్వ రిజిస్టర్ అనుమతులు ఉన్నాయా అంటే, అవి కూడా లేవు.

బాధితుల దగ్గర ఒక లక్ష కు రూ. 20,000 కటింగ్ చేస్తూ రోజువారీగా రెండు వేల రూపాయలు కట్టించుకుంటున్నారు. బాధితుల దగ్గర ప్రాంసరీ నోట్లు,  చెక్ బుక్ లో మీద సంతకాలు పెట్టించుకుని, వారి దగ్గర ముందే వడ్డీ డబ్బులు కట్ చేసుకుని ఇస్తున్నారు. రోజు వారి డబ్బులు కట్టే పద్ధతిలో ఏ ఒక్క రోజు లేటు అయినా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కొడతాం చంపుతామని బెదిరిస్తు దుకాణం షాపులను ముయిస్తున్నారు. వీరి దగ్గర ఎటువంటి అనుమతులు లేకున్నా, వీరి అక్రమ ఫైనాన్స్ మార్గాలు మాత్రం ఆగడం లేదు.

బాధితులను ఫైనాన్స్ వారు ఇబ్బందులకు గురిచేసిన వారు మాట్లాడిన మాటలకు రికార్డులు కొట్టిన డబ్బులకు ఫోన్ పే గూగుల్ పే కొట్టిన రికార్డులు వారికి కట్టిన డబ్బుల రికార్డులు భద్రంగా ఉన్నాయని ఓ బాధితుడు విజయ క్రాంతికి తెలిపారు.  ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి అక్రమ ఫైనాన్స్ దందాకు అడ్డుకట్ట వేసి నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు సరైన విధంగా న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.