calender_icon.png 8 October, 2024 | 6:03 PM

Breaking News

ఎట్టకేలకు జిల్లాలో ఉచిత చేప పిల్లల విడుదల

08-10-2024 03:52:11 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ చెరువులో చేప పిల్లల విత్తనాలను విడుదల చేసిన పోచారం.. మత్స్యకారుల్లో ఆనందం

కామారెడ్డి (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభంలో వేయాల్సిన చేప పిల్లల విత్తనాల ఆలస్యమైంది. మత్స్యకారులు గత నాలుగు నెలలుగా ఎదురు చూడగా రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసి జిల్లాలోని మత్స్యకారులు ఉచిత చేప పిల్లల విత్తనాలను విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు చేప పిల్లల విత్తనాల పంపిణీ శ్రీకారం చుట్టింది. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పెద్ద చెరువులో చేప పిల్లల విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తో కలిసి ప్రభుత్వ సబ్సిడీ ఉచిత చేప పిల్లల విత్తనాలను చెరువులో విడుదల చేశారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల విత్తనాలను అందించడం జరుగుతుందని తెలిపారు. నీరు నిల్వ ఉన్న చెరువులు కుంటలు ప్రాజెక్టులలో ఉచిత చేప పిల్లల విత్తనాలను వదలనున్నట్లు తెలిపారు. రెండు కోట్ల 80 లక్షల విలువచేసే చేప పిల్లల విత్తనాలను కామారెడ్డి జిల్లాలో నీ చెరువులు కుంటల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు ఎంతో ఉపాధి లభించడమే కాకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే ఉచితంగా సబ్సిడీ రూపంలో చేప విత్తనాలను అందించడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. మత్స్యకారులకు చేతినిండా పని లభిస్తుందని పేర్కొన్నారు. కొంత ఆలస్యం జరిగిన ప్రాజెక్టులు చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో నీటితో నిండి ఉన్నాయని అన్ని ప్రాంతాలలో చేప పిల్లల విత్తనాలను వదలనున్నట్లు తెలిపారు. మత్స్యకాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.

దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను పేద ప్రజలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి ,అంజిరెడ్డి మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.