కొత్త హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటోంది తమన్నా భాటియా. 2024లో ఈ మిల్కీ బ్యూటీ కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘అరణ్మనై’ రూ.4 వంద కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే, తమన్నా నిరుడు ‘బాంద్రా’ అనే చిత్రంతో మలయాళంలోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో రెండు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.
గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ థియేటర్ రిజల్ట్ కారణంగా డిజిటల్ రైట్స్‌ను కొనడానికి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముందుకు రాలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిందనే తాజాగా అందుతున్న సమాచారం. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 15 లేదా 22న ఓటీటీలో రిలీజ్ కానుందట. మలయాళమే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతోందని వినవస్తోంది. దర్శకుడు అరుణ్ గోపీ ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ‘బాంద్రా’లో మలయాళ అగ్ర నటుడు దిలీప్ హీరో కాగా, తమన్నా హీరోయిన్. మిల్కీ బ్యూటీ డెబ్యూ చిత్రం ఎట్టకేలకు ఓటీటీకి వస్తుండటంపై ఆమె అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ మూవీ చేస్తోంది. సంపత్ నంది కథను అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నాగసాధువుగా కనిపించనుంది.