calender_icon.png 22 October, 2024 | 12:58 PM

ఎట్టకేలకు గెలుపు రుచి

19-10-2024 12:00:00 AM

ముల్తాన్: సొంతగడ్డపై పాకిస్తాన్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాక్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా తొలి టెస్టు ఓటమికి  ప్రతీకారం తీర్చుకున్న పాక్ సిరీస్‌ను 1 సమం చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్ స్టోక్స్ (37) టాప్ స్కోరర్. నోమన్ అలీ 8 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 24 నుంచి మొదలుకానుంది. ఇంగ్లండ్‌పై విజయంతో పాకిస్థాన్ సొంత గడ్డపై 1350 రోజుల తర్వాత టెస్టు మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.

చివరిగా  2021లో దక్షిణాఫ్రికాపై గెలుపు రుచి చూసిన పాకిస్థాన్ అప్పటి నుంచి స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయింది. అంతేకాదు 11 వరుస పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. ఇంగ్లండ్‌పై విజయంతో పాకిస్థాన్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకింది. ఇక టీమిండియా (74.24 శాతం) తొలి స్థానంలో ఉంది.