calender_icon.png 8 January, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు ముడిమ్యాల రోడ్డుకు మోక్షం

07-01-2025 10:59:56 PM

డబుల్ లేన్గా మారనున్న 8.2 కిలోమీటర్లు 

నేడు శంకుస్థాపన చేయనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు  

ఏడాది కిందే రూ.24 కోట్లు మంజూరు చేసిన సర్కారు..

చేవెళ్ల: చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. అది కూడా డబుల్ లేన్ గా మారనుంది. ఇక్కడ దశాబ్దం కింద వేసిన రోడ్డే తప్ప గత ప్రభుత్వంలో కనీసం రిపేర్లు కూడా చేయలేదు. దీంతో రోడ్డు గుంతల మయంగా మారి ముడిమ్యాల, కుమ్మెర, రావులపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొత్త రోడ్డు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి స్థానిక నేతలు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం ముడిమ్యాల గ్రామ చౌరస్తా(బీజాపూర్ హైవే) నుంచి ముడిమ్యాల, రావులపల్లి మీదుగా మొయినాబాద్ మండలం మేడిపల్లి చౌరస్తా(హిమాయత్ నగర్–తంగేడుపల్లి రోడ్డు) వరకు 8.2 కిలోమీటర్ల మేర డబుల్ లేన్ రోడ్డుకు రూ.24 కోట్లు ఆర్అండ్బీ శాఖ 2023 అక్టోబర్లో జీవో నెం.515 ఇచ్చింది. 

నెల కిందే శంకుస్థాపన చేయాల్సి ఉన్నా..

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జీవోను అప్గ్రేడ్ చేసి పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముడిమ్యాల–మేడిపల్లి చౌరాస్తాకు సంబంధించి అధికారులు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కూడా పూర్తిచేశారు. నెల కిందే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.  తాజాగా బుధవారం స్పీకర్ ప్రసాద్ కుమార్, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

పనులు కూడా తర్వగా పూర్తిచేస్తాం..

ముడిమ్యాల నుంచి మేడిపల్లి చౌరాస్తా వరకు 8.2 కిలోమీటర్ల మేరకు రోడ్డు పనులకు స్పీకర్, మంత్రులు శంకుస్థాపన చేయనుండడం సంతోషంగా ఉంది. పనులు కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలి.  గోనె ప్రతాప్ రెడ్డి,  ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్