మహిళల హాకీ ఇండియా లీగ్...
రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. రాంచీ వేదికగా శుక్రవారం ఒడిశా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ ని.లో, 37వ ని.లో), బల్జీత్ కౌర్ (42వ ని.లో), ఫ్రీకి మోస్ (43వ ని.లో) గోల్స్ సాధించారు. విజయం సాధించినప్పటికీ ఢిల్లీ ఆఖరి స్థానంలో ఉండగా.. ఒడిశా వారియర్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తుఫాన్స్‌తో తమిళనాడు డ్రాగన్స్, టీమ్ గొనాసికాతో యూపీ రుద్రాస్‌తో తలపడనుంది.