calender_icon.png 3 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ కొత్త ఫీజుల ఖరారు

16-07-2024 02:53:31 AM

  • ఫీజుల పెంపునకు కసరత్తు 
  • త్వరలో నోటిఫికేషన్ జారీ, కళాశాలల నుంచి ప్రతిపాదనలు స్వీకరణ

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల పెంపుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే మూడేళ్ల(2025 సం బంధించిన ఫీజుల ఖరారుపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు మొదలుపెట్టింది. సో మవారం మాసబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్‌ఆర్ సీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఏ ఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ రిజిస్ట్రా ర్లు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ ఇతర అధికారులు హాజరయ్యారు. 25 లోపు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఫీజులు పెరిగే ఛాన్స్...

ప్రతీ మూడేళ్లకోసారి ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఇతర వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన ఫీజుల ఖరారుపై టీఏఎఫ్‌ఆర్‌సీ సమావేశమై నిర్ణయిస్తోంది. గత బ్లాక్ పీరియడ్ 2022 2023 2024 సంబంధించిన గడువు ఈ ఏడాదితో ముగియనుంది. అప్పుడు159 కాలే జీల్లో ఫీజులను అప్పట్లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ జీవో ప్రకారం ఇంజినీరింగ్ కనిష్ట ఫీజును రూ.45 వేలకు నిర్ణయించగా, గరిష్ట ఫీజును రూ.1.60 లక్షలకు పెంచారు. ఈ ఫీజులే ప్రస్తుత విద్యాసంవత్సరం వరకు అమల్లో ఉన్నాయి.

రాబోయే 2025 2026 2027 బ్లాక్ పీరియడ్ ఫీజుల సవరణకు ఇప్పటి నుంచే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే వచ్చే మూడేళ్లకు ఫీజులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఈనెల 25లోపు ఎప్పుడైనా నోటిఫికేషన్‌ను జారీ చేసి, అక్టోబర్ 30 వరకు కాలేజీలు తమ ప్రతిపాదనలు సమర్పించేందుకు అవకాశమిచ్చి, నవంబర్, డిసెంబర్‌లో కాలేజీలను ప్రత్యక్ష విచారణకు పిలుస్తారు. 

కాలేజీల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని...

బ్లాక్ పీరియడ్‌కు ఫీజుల సవరణకు గతంలో కాస్త ఆలస్యం చేసిన అధికారులు ఈసారి ఏమాత్రం జాప్యానికి తావులేకుండా 2025 బ్లాక్ పీరియడ్ ఫీజుల సవరణపై ముందుగానే కసరత్తును ప్రారం భించించారు. ఫీజుల సవరణపై టీఏఎఫ్‌ఆర్‌సీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కాలేజీలు కోర్సుల వారీగా ఫీజులను ప్రతిపాదిస్తాయి. తమ కాలేజీల్లో నాణ్యమైన విద్యా బోధన, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు తదితర సౌకర్యాలకు అనుగుణంగా ఫీజులు సవరించాలని టీఏఎఫ్ ఆర్‌సీకి ప్రతిపాదిస్తాయి.

ఆయా కాలేజీలన్నీ తమ తమ ఆదాయ, వ్యయాల ఆడిట్ రిపోర్టులను దరఖాస్తుతో సహా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిపై కాలేజీల యాజమాన్యాలను నేరుగా విచారణకు పిలిచి ఫీజులను ఖరారు చేస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అయితే దాదాపు అన్ని కాజీల్లో ఫీజులు పెరిగే అవకాశం ఉంది.