10-03-2025 08:40:49 AM
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య(Prannoy case) కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. వ్యాపార వేత్త మారుతీరావు కుమార్తె అమృతను ప్రణయ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పదో తరగతి నుంచి ప్రణయ్, అమృత మంచి స్నేహితులుగా ఉన్నారు. 2020 జనవరిలో హైదరాబాద్(Hyderabad)లో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్, అమృత పెళ్లితో రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో ప్రణయ్, అమృత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
విచారణలో అమృత ప్రణయ్ తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో తేల్చిచెప్పింది. 2020 సెప్టెంబర్ 14న వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి అమృత ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తుండగా దుండగులు ప్రణయ్ ను కత్తితో నరికి హత్య చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమృత భర్త ప్రణయ్ ఘటనాస్థలంలోనే ప్రాణలు వదిలాడు. కుమారైను పెళ్లి చేసుకున్నాడని మారుతీరావు ప్రణయ్ ను చంపించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రణయ్ ని చంపించినట్లు విచారణలో తేలింది. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్(SP AV Ranganath) పర్యవేక్షణలో ప్రణయ్ హత్య కేసు విచారణ కొనసాగింది. ప్రణయ్ హత్య కేసుపై ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో 2019 జూన్ 12 1600 పేజీల ఛార్జిషీట్ ను పోలీసులు రూపొందించారు. ప్రణయ్ హత్య కేసు విచారణ కోర్టులో దాదాపు ఆరేళ్లు కొనసాగింది. 2020 మార్చిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ2 ప్రణయ్ ను హత్య చేసిన బిహార్ వాసి సుభాష్ శర్మ, ఏ3 అస్ఘర్ ఆలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ 5 అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు శ్రావణ్, ఏ 7 డ్రైవర్ శివ ఉన్నారు. ఇవాళ న్యాయస్థానం నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది.