హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాగణపతి కొలువుదీరేందుకు సిద్ధమవుతున్నాడు. నిర్వాహకులు ఈ ఏడాది 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో 30 మంది కళాకారులు విగ్రహాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం కళాకారులు రేయింబవళ్లు పనిచేస్తూ విగ్రహానికి రంగులు అద్దుతున్నారు. 1954లో స్వాతంత్య్ర సమరయోధుడు సిరంగి శంకరయ్య తొలుత ఖైరతాబాద్‌లో ఒక అడుగు ఎత్తుతో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ అనవాయితీ కొనసాగుతున్నది. ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ఇటీవల అడ్‌హక్ కమిటీని ఏర్పాటైంది.