25-03-2025 07:15:10 PM
ఐటీడీఏ పీవో రాహుల్..
26, 27 తేదీలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకాండి..
భద్రాచలం (విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరం క్రీడా పాఠశాలలలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఐటిడిఏ భద్రాచలం పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ఫైనల్ ఎంపికలు ఈనెల 26న బాలురకు క్రీడా పాఠశాల కిన్నెరసానిలో, 27న బాలికలకు క్రీడా పాఠశాల కాచనపల్లిలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫైనల్ ఎంపికలకు ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు డైరెక్టుగా ఫైనల్ ఎంపికలలో పైన తెలుపబడిన బాలురకు క్రీడా పాఠశాల కిన్నెరసాని, బాలికలకు క్రీడా పాఠశాల కాచనపల్లిలో ఫైనల్ ఎంపికలలో పాల్గొనవచ్చునని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి మీ యొక్క విద్యార్థులను 26-03-2025 ఉదయం బాలురు కిన్నెరసానికి, 8:30 గంటలకు రిపోర్టు చేయగలరని, బాలికలు కాచనపల్లి క్రీడాపాఠశాలలో రిపోర్ట్ చేయగలరని ఆయన అన్నారు.
ఎంపికల కొరకు...
1) స్టడీ సర్టిఫికెట్
2) ఆధార్ కార్డు జిరాక్స్
3) పాస్ ఫొటోస్ -02
3) టీ షర్ట్ -షార్ట్
వెంట తీసుకొని రావాలని, డివిజనల్ స్థాయిలో బాలురు 296, బాలికలు 269 మొత్తం 565 మంది విద్యార్థులు పాల్గొన్నారని, విద్యార్థినీ విద్యార్థులు 1:2 రేషియో ఫైనల్ ఎంపికలో పాల్గొంటారని, ఈ విద్యార్థినీ విద్యార్థులను 9 రకాల బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లోడిగా రామారావు, కురుసం వెంకటేశ్వర్లు HM క్రీడా పాఠశాల కాచనపల్లి ASO వెంకటనారాయణ, పిడి బాలసుబ్రమణ్యం వార్డెన్ శంకర్ కోచెస్ లు పాల్గొంటారని ఆయన అన్నారు.