calender_icon.png 1 October, 2024 | 4:59 AM

వెయ్యి మందితో శివరాత్రి పాట చిత్రీకరణ

01-10-2024 03:06:18 AM

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన భావోద్వేగపూరితమైన సంఘటనలతో రూపొందుతున్న ఈ సినిమా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

శ్రీకాకుళంలోని శైవక్షేత్రమైన శ్రీముఖలింగం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని స్ఫూర్తితో మూవీ టీమ్ ఓ శివరాత్రి పాటను చిత్రీకరించింది. దేవిశ్రీ ప్రసాద్ దీనికోసం ఒక టైమ్‌లెస్ క్లాసిక్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నాగచైతన్య, సాయిపల్లవి.. వెయ్యి మంది డ్యాన్సర్లతో కలిసి నర్తించారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.