14-02-2025 01:16:52 AM
కామారెడ్డి , ఫిబ్రవరి 13,(విజయ క్రాంతి): బిక్కనూరు మండలం రామేశ్వరం పల్లి గ్రామంలో మూడు రోజులుగా సినిమా షూటింగ్ తీయడం ఎంతో అభినందనీయమని కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సినిమా షూటింగ్ ముగిసిన సందర్భంగా సినీ దర్శకులు భానుశంకర్, నిర్మాత రవికుమార్ తో పాటు ఆర్టిస్టులను ఆయన అభినందించారు. గ్రామీణ నేపథ్యాన్ని వెండి తేరపై చూపించేందుకు గ్రామంలో షూటింగ్ తీయడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.