హైదరాబాద్: సినిమా లవర్స్ కు థియేటర్స్ యాజమాన్యాలు భారీ షాక్ ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం సిన్మాలు లేకపోవడంతో థియేటర్లు నడపడం భారంగా మారిందని సింగిల్ స్క్రీన్ థియేటర్లతో ప్రదర్శనలు ఆపివేస్తున్నట్లు వెల్లడించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. మల్లీఫ్లెక్స్ ల రాకతో సింగల్ స్క్రీన్ థియేటర్లు కుదేలైన విషయం తెలిసిందే. సినిమా ప్రదర్శనల వల్ల నష్టం ఎక్కువగా వస్తుందని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని పేర్కొన్నాయి.