calender_icon.png 4 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నిర్మాత మురళీకృష్ణ విద్రోహ శక్తి

24-03-2025 12:00:00 AM

  • పుల్కల్ మండలంలో అడుగుపెట్టకుండా నిషేదించాలి 
  • మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎస్పీకి విజ్ఞప్తి
  • జోగిపేట సీఐ కార్యాలయంలో కేసు వివరాలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

ఆందోల్ మార్చి 23 : సిని నిర్మాత మేడికొండ మురళీకృష్ణ కిరాయి మనుషులతో రౌడీయిజం చేస్తూ సంఘ విద్రోహ శక్తిగా మారాడని ఆందోల్ మాజీ శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఆదివారం నాడు జోగిపేట పోలీస్ స్టేషన్లోని  సిఐ కార్యాలయంలో  సీఐ అనిల్ కుమార్ ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం నాడు పుల్కల్ మండలం గోంగులూరు లో పల్లె క్రాంతి కుమార్ పై జరిగిన హత్యా ప్రయత్నం కేసు వివరాలు తెలుసుకున్నారు.

ఈ విషయమే పోలీసులు వెంటనే స్పందించాలని నిర్మాత మేడికొండ మురళీకృష్ణ పై అతని అనుచరులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీఐ అనిల్ కుమార్ ను కోరారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో  మాట్లాడుతూ పుల్కల్ మండలం గోంగులూరు గ్రామంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య కుమారుడు పల్లె క్రాంతి కుమార్ పై శనివారం వేట కొడవళ్ళ తో 26 మంది కిరాయి రౌడీలు దాడి చేసి అత్యాయత్నం చేయడం దారుణం అన్నారు.

ప్రశాంతంగా ఉండే పల్లెల్లో గుండాయిజం చేస్తున్న  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ డిసిసిబి ఉపాధ్యక్షుడు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, పట్లోళ్ల జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య, బి ఆర్‌ఎస్ నాయకులు, బాధితులు ఉన్నారు.

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ల్యాండ్ మాఫియాగా మారిన నరసింహనాయుడు సినీ నిర్మాత మేడికొండ మురళి కృష్ణ పుల్కల్ మండలం గోంగులూరు లో భూమి విషయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య  కుటుంబం పై జరిపిన హత్య ప్రయత్నంలో బాధితులైన వారిని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. తమ కుటుంబానికి అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు.