25-03-2025 08:38:09 PM
మురళీకృష్ణపై పీడి యాక్ట్ వెంటనే నమోదు చేసి కఠినంగా శిక్షించాలి..
పల్లె సంజీవయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలి..
దాడిలో గాయపడ్డ సీనియర్ దళిత నాయకుడు పల్లె సంజీవయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేవిపీఎస్ నేతలు..
కేవిపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్..
సంగారెడ్డి (విజయక్రాంతి): పుల్కల్ మండలం గోంగ్లూరు గ్రామానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు పల్లె సంజీవయ్య అతని కుటుంబ సభ్యులు కొడుకు పల్లె క్రాంతి కిరణ్ సోదరుడు బాలయ్యపై భూమి తగాదా విషయంలో శనివారం సాయంత్రం సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ కొంతమంది దుండగులను పంపి కత్తులు కారం పొడితో దాడి చేసి కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ అన్నారు. మంగళవారం పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో పల్లె సంజీవయ్య దాడిలో గాయపడ్డ వారి కుటుంబ సభ్యులను కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, సిపిఎం అందోల్ ఏరియా కార్యదర్శి విద్యాసాగర్ ఉమ్మడి మండల నాయకులు నాగభూషణం కెవిపిఎస్ ఉమ్మడి మండల అధ్యక్షులు రాజు కార్యదర్శి గంగారం జిల్లా సహాయ కార్యదర్శి దాస్ తో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ... ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూన్నామని అన్నారు. గొంగ్లూరు గ్రామంలో సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ దౌర్జన్యాలు ఆగడాలకు అడ్డే లేదని అన్నారు. సర్వేనెంబర్ 794లో పల్లే సంజీవయ్య 6 ఎకరాలు భూమి ఉండగా అందులో ఎకరన్నార భూమిని వేరే వాళ్లకు విక్రయించాడని కానీ తన భూమి పక్కనే భూమి ఉన్న సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ దళితుడైన పల్లె సంజీవయ్య భూమిని కాజేయాలని చుసాడని అన్నారు. సంజీవయ్యను అతని సోదరుడు బాలయ్య కుమారుడు క్రాంతి కిరణ్ ను కట్టేసి కండ్లల్లో కారం పొడి కొట్టి ఆ తర్వాత క్రాంతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. దాడిలో క్రాంతి కిరణ్ తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. గ్రామంలో అనేకమంది రైతుల భూములను లీజుకి తీసుకొని ఒప్పందం ప్రకారం లీజు ముగిసిన తిరిగి భూములు అప్పగించకుండా నాకే ఈ భూములు ఇవ్వాలని దౌర్జన్యం చేయడం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం దారుణమని అన్నారు.
ఇప్పటికే వెంకట మురళీకృష్ణపై దౌర్జన్యాలు అత్యాయత్నాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ కేసులు ఉన్న అతనిపై కఠినమైన చర్యలు తీసుకోకుండా పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఈ ఘటన జరిగిందని అన్నారు. గతంలోని కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడు సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అతనిపై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేసి వేంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలన్నారు. మురళీకృష్ణ దౌర్జన్యాలు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత రైతులను ఆదుకోవాలి అన్నారు.