calender_icon.png 26 December, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో నేడు సినీ ప్రముఖుల భేటీ

26-12-2024 01:06:07 AM

  1. బృందంలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు
  2. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు వెల్లడి
  3. నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి శ్రీతేజ్ పరామర్శ
  4. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ రూ.కోటి 
  5. నిర్మాతలు రూ.50లక్షలు.. దర్శకుడు రూ.50లక్షల సాయం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): టాలీవుడ్‌లో వర్తమాన పరిస్థితులపై గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో సినీపెద్దలు భేటీ కానున్నామని, ఈ మేరకు సీఎంవో నుంచి అనుమతులు వచ్చాయని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను బుధవా రం ఆయన అల్లు అరవింద్, పుష్ప నిర్మా త రవిశంకర్‌తో కలిసి పరామర్శించారు. బాలుడి తండ్రి భాస్కర్, వైద్యులతో ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. 

టాలీవుడ్, సర్కార్ మధ్య వారధిని

దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. బాలుడి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని వైద్యులు తెలిపారన్నారు. సీఎంతో భేటీ బృందంలో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉంటారని స్పష్టం చేశారు. ‘ఇటీవల మీరు ఎఫ్‌డీసీ చైర్మన్ అయినందుకు సీఎంను కలుస్తున్నారా? ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య సయోధ్య కోసం వెళ్తున్నారా?’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ‘నేను చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని.

నేను టాలీవుడ్‌కు, సర్కార్ మధ్య వారధిగా పనిచేస్తా’నని దిల్‌రాజు స్పష్టం చేశారు. ‘ఇటీవల అల్లు అర్జున్‌ను మీరు కలిశారా?’ అనే ప్రశ్న కు ‘ఇంకా లేదు. త్వరలోనే కలుస్తాను’ అని సమాధానమిచ్చారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడు తూ..

శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, పుష్ప నిర్మాతల తరఫున రూ.50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ తరఫున రూ. 50 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. శ్రీతేజ్ త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సంబంధిత చెక్కులను ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుకు అల్లు అరవింద్ అందజేశారు.