calender_icon.png 12 January, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ మృతి

06-09-2024 01:22:53 PM

రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఆనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సిరిసిల్ల లోని చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, దర్శకుడిగా ఇలా పలు రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సాహిత్య రంగంలో వడ్డెపల్లి కృష్ణ గారి సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. లలితా గీతాల రచయితగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. పిల్ల జమిందార్, భైరవ ద్వీపం, అమృతకలశం, పెద్దరికం, పిలిస్తే పలుకుతా తదితర చిత్రాలకు పాటలు రాశారు. 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించారు. 4 రోజుల కిందటే సినీ రచయితల సంఘం ఆయన్ను జీవనసాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆయన మృతి పట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.