ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ మరణించారు. అత్యంత దయనీయ స్థితిలో కులశేఖర్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. లిరిక్ రైటర్‌గా కులశేఖర్ కొంత కాలం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత ఆయన డౌన్ ఫాల్ ప్రారంభమైంది. దీంతో ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. ఈ క్రమంలోనే అత్యంత దయనీయ స్థితిలో తుదిశ్వాస విడిచారు.
కులశేఖర్ స్వస్థలం వైజాగ్. తరువాత ఆయన హైదరాబాద్‌కు వచ్చి జర్నలిస్టుగా పని చేశారు. ‘చిత్రం’ సినిమాతో గీత రచయితగా మారారు. ఆ తరువాత ‘ఔనన్నా కాదన్నా’, ‘ఘర్షణ’, ‘భద్ర’, ‘నువ్వు నేను’, ‘సంతోషం’, ‘జయం’, ‘సైనికుడు’ వంటి చిత్రాలకు పాటలు రాశారు.