హైదరాబాద్: కాసేపట్లో సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశం జరగనుంది. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వరంలో సీఎంతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై, ఇటీవల జరిగిన పరిణామాలపై సినీ ప్రముఖులతో సీఎం చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో భేటీకి నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు, నటులు హాజరుకానున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకున్నారు.