calender_icon.png 28 December, 2024 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగరాజు త్యాగం వృదాకాదు

27-12-2024 10:43:07 PM

ప్రభుత్వం తప్పక గుర్తిస్తుంది             

సినీ డైరెక్టర్ ఎన్ శంకర్

మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల(Singareni Coal Mines) ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని, ఉద్యమాలకు, చైతన్యానికి సకల కళలకు ఈ నేల పుట్టినిల్లని ఇక్కడి బిడ్డగా అంతడుపుల నాగరాజు ధూమ్ ధామ్(Dhoom Dham Founder Nagaraju) సృష్టి కర్తగా తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో ఆయన పాత్ర గొప్పదని నాగరాజు త్యాగాన్ని త్వరలో ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందని సినీ డైరెక్టర్ ఎన్ శంకర్(Film Director N Shankar) స్పష్టం చేశారు. పీరీల మొక్కుల చెల్లింపులో భాగంగా శుక్రవారం పట్టణానికి వచ్చిన ఆయన పాత బస్టాండ్ లోని గపూర్ బాబా దర్గాను సందర్శించారు. అనంతరం వెంకటేశ్వర ఆలయ ప్రాంతంలోని గపూర్ బాబా నివాసంలోని  పీరీలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆనంతరం వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించగా పట్టణ కళాకారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జై భోలో తెలంగాణ షూటింగ్ లో భాగంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటాలనే ఉద్దేశ్యంతో మతాలకు అతీతంగా అందరు దైవంగా భావించే పీరీలను సినిమాలో ప్రదర్శించామన్నారు. ఆనాటి షూటింగ్ లో మొక్కులో భాగంగా మొక్కులు తీర్చుకు నెందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రమకు, సౌందర్యానికి, సాహిత్యానికి సింగరేణి నేల పుట్టినిల్లని,సింగరేణి ప్రాంతంలో రానున్న రోజులలో తెలంగాణ చరిత్రపై డాక్యుమెంటరీ తీయనున్నట్లు తెలిపారు. ఈ నల్ల నేల ముద్దు బిడ్డ నాగరాజు ధూమ్ ధామ్ సృష్టి కర్తగా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అని విత్తనాలు చల్లి సాగు చేసింది.

ఒకరైతే పంట కోసుకొని తిన్న వారు మరొకరని, నాగారాజుకు తీరని అన్యాయం జరిగిందని, ఎవరో దాచితే చరిత్ర దాగదని రానున్న రోజులలో నాగరాజుకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సిద్దిస్తే ఆకలి చావులు, నిరుద్యోగం, పేదరికం పోతుందా అని  అంబేద్కర్ విగ్రహం వద్ద ఆనాటి తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారీ మాట్లాడిన మాటలు ఇప్పటికి నా మదిలో కదలాడుతూనే ఉంటాయని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా కొంత మార్పులు వచ్చిన తెలంగాణ ప్రజల బతుకులలో  మరింత మార్పులు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. పుష్ప సినిమా ప్రీరిలీజ్ ఘటనలో తప్పు ఎవరి దైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ధూమ్ ధామ్ సృష్టి కర్త అంతడుపుల నాగరాజు, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.