calender_icon.png 26 October, 2024 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల్లో సినీ ప్రముఖులు

16-07-2024 12:10:00 AM

సినీ పరిశ్రమలో వివాదాలు కొత్తేమీ కాదు. సినిమాలే కాదు, ఇండస్ట్రీ ప్రముఖుల వివాదాల గురించి తెలుసుకునేందుకూ ఆసక్తి కనబర్చే ప్రేక్షక పాఠకులెందరో. తాజాగా ఇలాంటి వివాదాలు కొన్ని సినిమా సర్కిళ్లలో ఆసక్తికర చర్చకు తెరతీస్తున్నాయి. ఆ కేసుల వివరాల్లోకి వెళ్తే... కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. కథానాయకుడిగా నటి స్తూ నిర్మించిన ‘బ్యాచిలర్ పార్టీ’ చిత్రం ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. ఈ సినిమా ఇదే ఏడాది జనవరిలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం అమె జాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను రక్షిత్ శెట్టి సొంత నిర్మా ణ సంస్థ పరంవా స్టూడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, ఎంటీఆర్ మ్యూజిక్‌లో ఓ భాగస్వామి అయిన నవీన్ కుమార్.. రక్షిత్ శెట్టిపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమ కాపీరైట్ అనుమతులు లేకుండానే రక్షిత్ ‘బ్యాచిలర్ పార్టీ’ మూవీలో తమ పాటలను ఉపయోగించారనేది నవీన్ ఆరోపణ. ‘న్యాయ ఎల్లిదో’, ‘ఒమ్మే నిన్ను’ చిత్రాల్లోని పాటలను కాపీ కొట్టి ‘బ్యాచిలర్ పార్టీ’లో వినియోగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ముదిరిన ‘పొలిమేర’ వివాదం  

అటు ‘పొలిమేర నిర్మాత గౌరీకృష్ణ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు. సినిమాను వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటూ తనను సంప్రదించిన నందిపాటి వంశీ, సుబ్బారెడ్డిలకు సినిమా రైట్స్ రాసిచ్చానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత కాలంగా అడుగుతున్నా పట్టించుకోకపోవటంతో వాళ్ల ఆఫీస్‌కు వెళ్లి ఒప్పందం చేసుకున్న డబ్బులు అడిగితే.. చంపేస్తామంటూ వంశీ నందిపాటి బెదిరించారని గౌరీకృష్ణ ఆరోపించారు.

మూడో భాగం తెరకెక్కిస్తున్నట్టు వంశీ నందిపాటి వెల్లడించిన నేపథ్యంలో మొదటి రెండు భాగాలు నిర్మించిన గౌరీకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. ఆ సినిమా తనదని, మీరెలా నిర్మిస్తారని అంటున్నారు. రెండో భాగం పంపిణీకి హక్కులు తీసుకొని లెక్కలు చెప్పలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తాను ఇచ్చిన డాక్యుమెంట్స్‌ను మిస్ యూజ్ చేసి, సినిమా హక్కులు మొత్తం వారికి ఇచ్చేసినట్టు చెబుతున్నారని గౌరీకృష్ణ చెప్తున్నారు. ఇదిలా ఉండగా, గౌరీకృష్ణ అబద్ధం చెప్తున్నారని, చాంబర్‌లో అందరి ముందు హక్కులు తమకు ఇస్తున్నట్టు చెప్పిన సంగతి పెద్దలందరికీ తెలుసు అని నిర్మాత వంశీ అంటున్నారు. నిర్మాతల కౌన్సిల్ పెద్ద ప్రసన్నకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.. న్యాయం వంశీ వైపు ఉందని చెప్తారు. సినిమాతో తనకు ఏ సంబంధమూ లేదంటూ గౌరీకృష్ణ తన ముందే కాగితం రాసి ఇచ్చారని అన్నారు.  

‘భారతీయుడు నటి సోదరుడిపై డ్రగ్స్ కేసు 

డ్రగ్స్, టొబాకో ఉత్పత్తుల నివారణలో భాగస్వామ్యం కావడం సామాజిక బాధ్యతగా భావించాలంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులకు సూచించింది. టొబాకో, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ అడ్వర్టయిజ్ వీడియో రూపొందించి థియేటర్లలో ప్రదర్శించాలనే నిబంధన కూడా పెట్టింది. ఈ నిబంధన ‘భారతీయుడు అమలైంది. అయితే, భారతీయుడు  ఓ ముఖ్య పాత్రలో నటించిన స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు కావటం కలకలం రేపుతోంది. అమన్ సహా మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.