27-02-2025 02:41:54 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ న్యూసైన్స్ కాలనీలో గల నివాసం లో ఆయన్ను సంబేపల్లి పోలీసులు బుధవారం రాత్రి 8-45 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఆయనపై బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం 196, 353(2), 111 రెడ్‌విత్3 (5) సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.
దీంతో ఇక్కడి నుంచి ఏపీలోని రాజంపేట ఫస్ట్‌క్లాస్ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను పోలీసులు హాజరుపర్చనున్నారు. కాగా అరెస్ట్ సందర్భం గా పోసాని కృష్ణమురళి భార్యకు ఇచ్చిన నోటీసులో ఫిబ్రవరి 27 అని తేదీ ఉండటం గమనా ర్హం. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వైసీపీ అధికారం లో ఉన్న సమయంలో ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే.
కాగా కొంతకాలంగా గతంలో జరిగిన సంఘటనలపై పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నా రు. అధికారంలో ఉన్న సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదులతో పోలీసులు అదుపులోకి తీసుకుం టున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు నందిగం సురేశ్, వల్లభనేని వంశీతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.