* పీసీబీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్, జనవరి 29, (విజయక్రాంతి): హైదరాబాద్ షేక్‌పేట్ పరిధిలోని హమీద్కుంట, అంతగానికుంట, బంజారా చెరువు సుందరీకర ణ పేరుతో చెరువులను పూడ్చేస్తున్నారంటూ బంజారాహిల్స్‌కు చెం దిన డాక్టర్ క్యూ హాసన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజొయ్పాల్, జస్టిస్ రేణక యారా డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. చెరువు సుందరీకరణ పేరుతో చెత్తతో నింపేస్తున్నారని, చెరువు రూపురేఖలు లేకుండా చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చెరువు మధ్య నుంచి చేస్తున్న నడక మార్గం పనులను వెంటనే నిలిపేయాలని ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. చెరువును పునరుద్ధరించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.
కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. చెరువుల సుందరీకరణకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. అభివృద్ధి, పనులు చేపట్టడం, చెరువుల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వాదించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనిఖీలకు వెళ్లిన రోజు ఎలాంటి పనులు జరగడం లేదని, గోడ మీద పిల్లి తరహాలో వివరణ ఇవ్వడంపై మండిపడింది. సమగ్ర నివేదిక అందజేయాలని పీసీబీని ఆదేశిం చింది. విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.