ఇటీవల జరిగిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల బదిలీలతో చాలా పాఠశాలల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. అనేక ఉన్నత పాఠశాలల్లో సగానికి పైగా సబ్జెక్టులకు టీచర్లు లేరు. ముఖ్యమైన సబ్జెక్స్ అయిన ఆంగ్లం, సైన్స్, గణితం విభాగాలకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలపై దీని ప్రభావం తప్పకుండా పడుతుందని విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలవల్ల ఖాళీ అయిన పాఠశాలలు, పోస్టుల వివరాలు విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్