ప్రభుత్వ శాఖలలో కీలక పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రజలకు పనులు వాయిదాలు వేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కొన్నిచోట్ల ప్రభుత్వం వేరే అధికారులను సదరు పోస్టులలో ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నది. అయితే, ఇలా ఇన్‌చార్జ్‌లుగా నియమించడం వల్ల తప్పనిసరి పనులు తప్ప ప్రజల అన్ని సమస్యలూ పరిష్కారం కావడం లేదు. సదరు ఇన్‌చార్జ్ అధికారులకు రెండు పడవలపై ప్రయాణం అన్నట్లుగానూ పరిస్థితి మారింది. ఖాళీ పోస్టులలో ఇన్‌చార్జిలు కాకుండా రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.