17-03-2025 02:04:59 AM
కేసులో ఏడుగురికి 14 రోజుల రిమాండ్
మరో 21 మందిని గుర్తించినట్లుగా సమాచారం
మోతె,మార్చి16:- మోతె మండలములోని రెవెన్యూ ఆఫీసులో ఫైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం లో సంచలనం రేపిన కేసు ఓ కొలిక్కి వచ్చింది. మార్చి 4 న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,ఆర్డీవోతో కలిసి మోతె తహసిల్దార్ ఆఫీసును ఆకస్మిక చేసిన తనిఖీలలో బయటికి వచ్చిన పహానిలా ట్యాంపరింగ్లో 11 నకిలీ ఫైల్స్ ను గుర్తించారు.
ఇన్ని రోజులు ఉత్కంఠ గా సాగిన ఈ కేసులో పూర్తి ఆధారాలతో ఏడుగురు నిందితులను ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీరికి జిల్లా జడ్జ్ 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో సస్పెండ్ అయిన తహసిల్దార్ సంఘమిత్ర ,మహిళా ఆర్‌ఐ నిర్మలాదేవిని నల్గొండ సబ్ జైలుకు తరలించారు. మీసేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో వీరితోపాటు మరో 21 మందిని గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు గా సమాచారం.